దేశభక్తి, ఉత్సాహంతో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Telangana

జెండాను ఎగురవేసి, స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన ప్రోవీపీ ప్రొఫెసర్ డీ.ఎస్. రావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని గాంధీజీ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా, దేశభక్తి స్ఫూర్తితో నిర్వహించారు. ఉదయం 8.50 గంటలకు ఆరంభమైన ఈ వేడుకలలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ శుభ సందర్భంగా, గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు జాతీయ జెండాను ఎగురవేసి, దేశ నిర్మాణంలో విద్యా సంస్థల పాత్రను ప్రతిబింబిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ప్రసిద్ధ జై జవాన్, జై కిసాన్ లకు జై విజ్జాన్, జై అనుసంధాన్ లను జోడించడం ద్వారా భారతదేశ పురోగతికి దోహదపడాలని ఆయన విద్యా సమాజాన్ని కోరారు. మేధో, సాంకేతిక స్వావలంబనను సాధించడంలో నిజమైన స్వాతంత్ర్యం ఉందని, విద్య ఆత్మ విశ్వాసం, సామర్థ్యం, నైపుణ్యాలు, ప్రపంచవ్యాప్తంగా నాయకత్వం వహించడానికి సరైన వైఖరిని పెంపొందించాలని ప్రొఫెసర్ డి.ఎస్. రావు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎన్ సీసీ క్యాడెట్లు, విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రదర్శించేలా కవాతు నిర్వహించారు. కళాకృతి విద్యా విభాగం శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించగా, భద్రతా సిబ్బంది మనోహరమైన దేశభక్తి గీతాలను ఆలపించారు.భద్రతా సిబ్బందికి వారి అంకితభావం, సేవకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆ తరువాత ఎన్ సీసీ క్యాడెట్ల ర్యాంక్ వేడుక జరిగింది. దేశ స్వాతంత్ర్యానికి చిరస్మరణీయమైన, అర్థవంతమైన నివాళిగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని స్టూడెంట్ లైఫ్ బృందం చాలా జాగ్రత్తగా సమన్వయం చేసింది. ఇందులో పాల్గొన్న వారందరికీ మిఠాయిలు, అల్పాహారం అందించడంతో ఈ వేడుకలు ముగిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *