మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు మరియు యువజన శాఖల నూతన మంత్రి వాకిటి శ్రీహరి ని మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ని శాలువాతో ఘనంగా సత్కరించి, సౌహార్దపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, యువతకి రాజకీయ అవకాశాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ: సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పని చేయాలి. యువతకు రాజకీయ, ఆర్థిక రంగాలలో అవకాశాలు కల్పించగలగాలని పేర్కొన్నారు.