పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ మరియదాసు మత్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్ డీ) పట్టాను పొందారు. కాకినాడలోని జేఎన్ టీయూ విశ్వవిద్యాలయం దీనిని ప్రదానం చేసింది.‘కన్వల్యూషనల్ న్యూరల్ నెట్ వర్క్ లను ఉపయోగించి ఈఈజీ సిగ్నల్ లలో ఆర్టిఫ్యాక్ట్ తొలగించే పద్ధతుల అమలు’ అనే అంశంపై మరియదాసు పరిశోధన చేసి, సిద్ధాంత వ్యాసం సమర్పించారు. విజయవాడలోని వీ.ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.పద్మజ, జేఎన్ టీయూ కాకినాడ (అటానమస్) విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ ప్రొఫెసర్ డాక్టర్ బీ.టీ.కృష్ణల మార్గదర్శనంలో ఈ పరిశోధన జరిగింది.ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (ఈఈజీ) అనేది న్యూరోసైన్స్ లో ఒక ముఖ్యమైన సాధనం. ఇది మెదడు కార్యకలాపాలను నమోదు చేయడానికి, నాడీ సంబంధిత రుగ్మతలను నిర్ధారించడానికి, చికిత్స చేయడంతో సహాయ పడుతుంది. మరియదాసు పరిశోధన ఈఈజీ సిగ్నల్స్ నుంచి ఆర్టిఫ్యాక్ట్ ను స్వయంచాలకంగా తొలగించడానికి అత్యాధునిక లోతైన విధానాన్ని అందిస్తుంది. ఇది నాడీ సంబంధిత అంచనాల ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన దశ.గీతం మ్యాట్ ల్యాబ్ లోని అత్యాధునిక పరికరాలను ఉపయోగించి మరియదాసు చేపట్టిన ఈ పరిశోధనాంశాలు నాలుగు ప్రసిద్ధ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.మరియదాసు పీహెచ్.డీ. పట్టాను సాధించి, ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నందుకు గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగానికి మరియదాసు చేసిన సేవలను ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
