ఎండిఆర్ ఫౌండేషన్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం…
– రామచంద్రపురం మైనారిటీ నాయకులు
పటాన్ చెరు:
ఎండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిని ఇస్తున్నాయని రామచంద్రపురం పట్టణ మైనార్టీ నాయకులు అన్నారు. గురువారం ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ… పౌండేషన్ చేస్తున్న సేవలు తమకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయని, తాము కూడా సేవలో ముందుంటామని, ఫౌండేషన్ తో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో మైనారిటీ అధ్యక్షుడు అజీమ్, జనరల్ సెక్రెటరీ మునీర్, ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు, నాయకులు షరీఫ్ ,యూత్ వింగ్ షాకిల్,ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.