మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని యలమంచిల ఉదయ్ కిరణ్ అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ నాగార్జున ఎన్ క్లేవ్ కాలనీ సభ్యులు మియాపూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రీటరీ యలమంచి ఉదయ్ కిరణ్ ఆద్వర్యంలో నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శెరిలింగంపల్లి ఇంచార్జ్ .జగదీశ్వర్ గౌడ్ ను కలిసి పలు సమస్యలు గురించి వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కారించి, మిగతా వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కారించేందుకు కృషి చేస్తానని వారు తెలిపారు.