మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, రామచంద్రాపురం హెచ్ఐజి కాలనీలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సమితి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో కె కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు సీనియర్ బిజెపి నాయకులు కే కృష్ణమూర్తి చారి తన ఫౌండేషన్ తరపున పలువురు స్త్రీమూర్తులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిడిఎంఎస్ అధ్యక్షురాలు కాత్యాయని, సెక్రటరీ దాక్షాయిని, మరియు ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సునంద కృష్ణమూర్తి, పద్మ దేవేందర్ రెడ్డి, సుజాత, అనిత మరియు పెద్ద ఎత్తున విచ్చేసిన మహిళా సమితి సభ్యులకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
