ఇష్టా జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నాణ్యత ప్రమాణాలతో నే ఇష్టా జూనియర్ కళాశాల నిర్వహణ కొనసాగుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా అధికారి (డిఐఈఓ)గోవింద్ రామ్ పేర్కొన్నారు. పటేల్ గూడ లోని ఇష్టా జూనియర్ కళాశాలలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారనే వచ్చిన వార్తలపై మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి గోవింద్ రామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ ను పరిశీలించడంతోపాటు విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కళాశాలకు గుర్తింపు లేదనే ప్రచారం అసత్యమని, గుర్తింపు ఉంది కాబట్టే విద్యార్థులు పరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా హాల్ టికెట్లు అందజేశామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇష్టా జూనియర్ కాలేజీలోకి బయట వ్యక్తులు వచ్చి న్యూసెన్స్ చేశారని అన్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారమే కళాశాల నిర్వాహణ కొనసాగుతుందని చెప్పారు. జిల్లా అధికారితో పాటు ఇష్టా జూనియర్ కాలేజీ అకాడమిక్ డీన్, ప్రేమ్ కుమార్, ప్రిన్సిపల్ దీప, తదితరులు ఉన్నారు.