ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి సిఎం సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి పంపిణీ చేశారు.నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం, గోనెగొండ్ల మండలలాకు చెందిన 18 మంది లబ్దిదారులకు రూ. 18లక్షల ఆర్థిక సహాయాన్ని (చెక్కులను) అందచేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యేటా వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సిఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వైద్యం కోసం సహాయం చేసిన సీఎం చంద్రబాబుకు బాధిత కుటుంబ సభ్యులుకృతజ్ఞతలు తెలిపారు