మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అమీన్పూర్ మండలంలో మిగిలిన. జానకంపేట, వడక్ పల్లి గ్రామాలను అమీన్పూర్ మున్సిపాలిటీలో చేర్చాలని. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ను. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఎం ఏ యు డి కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామపంచాయతీలలో ఆరు గ్రామపంచాయతీలను ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగిందని తెలిపారు. రెండు గ్రామాలు విలీనం కాకపోవడంతో పరిపాలనాపరంగా అభివృద్ధి కోణంలో తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. మిగిలిన రెండు గ్రామాల అంశంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
