శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
మియాపూర్ డివిజన్ లోని సర్వేనెంబర్ 28 సిఆర్పిఎఫ్ సమస్య పరిష్కరించాలని కోరుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జీ రవి కుమార్ యాదవ్ ఆద్వర్యం లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని కలిసిన మియాపూర్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు మరియు నడిగడ్డ తండ సుభాష్ చంద్రబోస్ నగర్ ఓంకార్ నగర్ కాలనీ వాస్తవ్యులు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి విశ్వేశ్వర్ రెడ్డి సమస్య పరిష్కరించడానికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, మియాపూర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పార్నంది మాణిక్ రావు, నడిగడ్డ తాండ వాస్తవ్యులు నాయిని రత్నకుమార్, రవీందర్ నాయక్, సుభాష్ చంద్రబోస్ నగర్ వాస్తవ్యులు వెంకట్, ఓంకార్ నగర్ కాలనీ వాస్తవ్యులు పత్తి భాషా శివ, కప్పెర జంగయ్య లు పాల్గొన్నారు.