ప్రభుత్వ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ తో కేఎస్ పీపీ అవగాహన 2.5 కోట్ల మంది భారత పౌర సేవకుల సామర్థ్యం బలోపేతం లక్ష్యం

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారత ప్రభుత్వంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ)తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) గురువారం న్యూఢిల్లీలోని సీబీసీ కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వంలోని మానవ వనరుల నిర్వహణ పద్ధతులను మెరుగుపరచడం, భారతదేశంలోని 2.5 కోట్ల పౌర సేవకుల సామర్థ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నాలెడ్జ్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది.ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో, కేఎస్ పీపీ తరఫున డీన్, పూర్వ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్, డాక్టర్ షరీక్ హసన్ మనజీర్ లు: సీబీసీ ప్రతినిధి బృందంలో మానవ వనరుల విభాగం సభ్యుడు డాక్టర్ ఆర్. బాలసుబ్రమణ్యం, సంయుక్త కార్యదర్శి ఎస్.పీ. రాయ్, ఇతర అధికారులు రాహుల్ పోర్వాల్, నికితా సురానా తదితరులు పాల్గొన్నారు.భారత ప్రభుత్వం, దాని మానవ వనరుల అభ్యసాలు, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా భారతదేశం యొక్క అమలు సామర్థ్యాన్ని సమూలంగా పెంచాలని లక్ష్మించింది.

ఈ అంశంలో సీబీసీ ముందంజలో ఉండి, వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని విభాగాల కోసం సామర్థ్యాలను పెంపొందించే ప్రణాళికలను రూపొందింది. అమలు చేయడానికి కృషి చేస్తోంది. దీనికోసం సీబీసీ సమగ్రమైన, ముందు చూపుతో కూడిన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ప్రముఖ సంస్థలతో వ్యూహాత్మక జ్ఞాన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటోంది.ఈ నాలెడ్జ్ పార్టనర్ షిప్ కింద, కేఎస్ పీపీ భారతదేశం నుంచి పాలనా విధానాలు, ప్రపంచ ఉత్తమ అభ్యాసాలను మిళితం చేసే భారతదేశ కేంద్రీకృత కేస్ స్టడీస్, నిజ-సమయ విధాన అనుకరణలతో (రియల్ టైమ్ పాలసీ సిమ్యులేషన్) సహా వాటికి అనుగుణమైన అభ్యాస వనరులను అందిస్తుంది. ప్రవర్తనా నైపుణ్యాల శిక్షణతో పాటు నైతిక నిర్ణయాధికారం, నాయకత్వం, డిజిటల్ పాలనతో పాటు యోగ్యత – ఆధారిత మాడ్యూల్స్ పై దృష్టి సారిస్తూ అధునాతన శిక్షణా కార్యక్రమాలను అభివృద్ధి చేస్తుంది.

సమగ్ర అవసరాల విశ్లేషణలను కూడా కేఎస్ పీపీ నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ పనితీరు లక్ష్యాలతో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి పాత్ర-ఆధారిత యోగ్యత పటాలు, అంతరాల విశ్లేషణ సాధనాలను కూడా సృష్టిస్తుంది. చొరవ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి, విధాన ఆవిష్కరణ ప్రయోగాలను చేయడానికి, డేటా ఆధారిత అంతర్హృష్టులను రూపొందించడానికి ఈ సహకారం, శిక్షణకు ముందు, ఆ తరువాత అంచనాలను కలిగి ఉంటుంది. అంతేకాక, ప్రభుత్వ అధికారుల కోసం ఆన్ లైన్, హైబ్రిడ్ కోర్సులను రూపొందించడానికి, దాని డిజిటల్ మౌలిక సదుపాయాల రూపకల్పనలను కేఎస్ వీపీ చేస్తుంది. అందుబాటులోని, ప్రభావవంతమైన అభ్యాస పరిష్కారాలను కూడా నిర్ధారిస్తుంది.కేఎస్ పీపీ, సీబీసీ మధ్య ఈ భాగస్వామ్యం. కేంద్ర ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులకు, భారతదేశ పౌర సేవల సామర్థ్యాన్ని పెంపొందించడానికి భాగస్వామ్య నిబద్ధతకు ప్రతీక. పబ్లిక్ పాలసీ ఎడ్యుకేషన్ లో కేఎస్ పీపీ యొక్క నైపుణ్యాన్ని, సామర్థ్య నిర్మాణానికి బలమైన విధానాలు రూపొందించడానికి సీబీసీ మిషన్ ను ఉపయోగించడం ద్వారా సహకారం, ప్రభావవంతమైన, స్థిరమైన ఫలితాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *