ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ప్రముఖ రచయిత, కవయిత్రి డాక్టర్ మీనా కందసామి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రశ్నించడం ప్రజల హక్కని, అసమ్మతి ప్రజాస్వామ్యానికి జీవనాధారం అని ప్రముఖ రచయిత, కవయిత్రి డాక్టర్ మీనా కందసామీ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని మీడియా స్టడీస్, ఆంగ్లం-ఇతర భాషల విభాగాల ఆధ్వర్యంలో ‘అసమ్మతి, సంభాషణ: ప్రజాస్వామ్య సమాజంలో మానవ హక్కుల ప్రాముఖ్యత’ అనే అంశంపై శనివారం ఆమె అతిథ్య ఉపన్యాసం చేశారు.మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనా మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో అసమ్మతి యొక్క కీలక పాత్రపై తన అభిప్రాయాలు, దృక్పథాలను వెల్లడించారు. ప్రస్తుత సామాజిక-రాజకీయ దృశ్యాన్ని ప్రశ్నించడం యొక్క ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. దైహిక సమస్యలతో విభేదించడానికి, విమర్శనాత్మకంగా పాల్గొనడానికి ప్రజలకు స్వేచ్చ. స్థలం ఉందా అని ఆలోచించమని ఆమె కోరారు. ప్రైవేటు యాజమాన్యంలో మీడియా ఏకీకరణ యొక్క భయంకరమైన ధోరణిని ఆమె ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఇది తరచుగా అట్టడుగు స్వరాలను నిశ్శబ్దం చేస్తోందంటూ ఆవేదన వెలిబుచ్చారు.
అసమ్మతి రచయితలు, మేధావులను ‘అర్బన్ నక్సల్స్’ లేదా ‘జాతి వ్యతిరేకులు’ అని ముద్ర వేసే సమస్యాత్మక ధోరణిని కూడా డాక్టర్ కందసామి ప్రస్తావించారు. కార్పొరేట్ అభివృద్ధి, వనరుల దోపిడీపై రాజ్యం దృష్టి సారించడాన్ని ఆమె విమర్శించారు. భిన్నాభిప్రాయాలకు సమాజం ఎలా విలువ ఇస్తుందో పునఃపరిశీలన చేయాలని పిలుపునిచ్చారు.గీతం ఆంగ్ల అధ్యాపకుడు డాక్టర్ సయంతన్ మండల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం చివరన డాక్టర్ కందసామి తన పదునైన పద్యం ‘రేపు ఎవరో మిమ్మల్ని అరెస్టు చేస్తారు’ ఆమె ప్రసంగంలోని అంశాలను లోతుగా ప్రతిధ్వనింపజేసింది.సమాజంలో విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడంలో ఇటువంటి చర్చల ప్రాముఖ్యత ఉందంటూ డాక్టర్ శ్రుతీష్ చేసిన వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఇందులో పాల్గొన్నవారు మానవ హక్కులు, భిన్నాభిప్రాయాల ఆవశ్యకత, ప్రజా సంభాషణను రూపొందించడంలో మీడియా పాత్ర గురించి అవగాహనను పునరుద్ధరించుకున్నారు.