సత్యసాయి జీవన విధానం అందరికి ఆదర్శం

Hyderabad politics Telangana

– పేదల కోసం అహర్నిషలు పరితపించారు

– సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప పరిణామం

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

సత్యసాయి బాబా జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ అన్నారు. పేద ప్రజలను అక్కున చేర్చుకొని అండగా నిలిచారని గుర్తు చేశారు. భక్తులకు బాబా మనోధైర్యాన్ని నింపి సుఖ సంతోషాలతో జీవించేలా ప్రోత్సహించారన్నారు. శనివారం మియాపూర్ ప్రశాంత్ నగర్ లోని సత్యసాయి నిలయంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదిన మహోత్సవం ఆలయ ట్రష్టి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జన్మదిన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బారాస నేత రవీందర్ యాదవ్ వెల్లడించారు. జన్మదిన వేడుకల్లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజలను అక్కున చేర్చుకొని అండగా నిలబడ్డారన్నారు. కేవలం భక్తికే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సత్యసాయి బాబా ముందున్నారని రవీందర్ యాదవ్ అన్నారు. సత్యసాయి బాబా ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలతో ప్రజల్లో నిత్యం జీవించే ఉన్నారన్నారు. సత్యసాయి భక్తుల హృదయాల్లో అనునిత్యం పూజించబడుతుంటారని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ లాంటి వ్యక్తులు ఇంకా ఇలాంటి సేవలు కొన సాగించడం హర్షించదగ్గ విషయం మన్నారు. ఈ నెల 11 వ తేదీ నుండి ప్రతీ రోజు వివిధ పూజ, భజన కార్యక్రమాలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమo లో భక్తులతో పాటు నేతలు వాలా హరీష్ రావు, గంగాధర్ రావు, బాబూమోహన్ మల్లేష్, గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *