మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బి. హెచ్. ఈ. ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించచారు. విద్యార్థులలు, ఉపాధ్యాయురాళ్లు ఆటాపాటలతో అలరించించారు. హిందీ ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థులు చక్కటి స్కిట్ లు ప్రదర్శించగా, టీచర్స్ విద్యార్థులతో పోటీపడి డ్యా న్సులు చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని వారిని అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. చదువుతో పాటు ఇతర కార్యక్రమాలలో కూడా విద్యార్థులు రాణించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ఫాదర్ అంబ్రోస్ బెక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.