ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు ముదిరాజ్

politics Telangana

-తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సంకల్పం గొప్పది

-ప్రజల మద్దతుతో మూసీ పునరుజ్జీవం అవుతుంది 

-ప్రజల సంక్షేమం అభివృద్ధికి పర్యాయపదం ప్రజాపాలన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

10 ఏళ్లు అప్పటి పాలకులచే నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం గొప్పదని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తూ తెలంగాణ సంక్షేమం అభివృద్ధికి పాటుపడుతున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత పాలకులచే నిర్లక్ష్యం చేయబడ్డ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి కృషి చేస్తున్నాడని కొనియాడారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాడని తెలిపారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అభివృద్ధికి పర్యాద పదంగా పాలన కొనసాగిస్తున్న రేవంత్ సర్కారుకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తుందన్నారు. ఆ ప్రజల మద్దతుతోనే మూసి ప్రక్షాళనకు ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ యావత్ ప్రజానీకం ఆశీస్సులతో మూసి పునరుద్ధరణ పక్క సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని నీలం మధు వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చి తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పునరుద్గాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *