* క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ ని ప్రారంభించిన రాహుల్ హెగ్డే ఐ.పి.ఎస్. (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ట్రాఫిక్)
* భారతదేశంలో తన ఎనిమిదవ క్లినిక్‌ను ప్రారంభించిన యుఎఈ యొక్క ప్రీమియర్ బ్రాండ్
* క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ సరసమైన ధరలకు ఉత్తమ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
అధునాతన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మరియు కాస్మెటిక్ ట్రీట్మెంట్లలో యుఎఈ యొక్క ప్రీమియర్ బ్రాండ్ అయిన క్యూటిస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు హైదరాబాదులో తమ కార్యకలాపాలను విస్తరించింది. నాణ్యమైన సంరక్షణ మరియు అధునాతన పరిష్కారాలను అందించడానికి పేరెన్నికగన్న క్యూటిస్ తమ చికిత్సలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది. గ్రూప్ వ్యవస్థాపకుడు ,ఛైర్మన్ డాక్టర్ షాజీర్ మాచించేరీ 2030 నాటికి జిసిసి , భారతదేశంలో అగ్రశ్రేణి ప్లేయర్లలో ఒకటిగా తమ సంస్థను నిలపాలనే లక్ష్యంతో కృషి చేస్తూ తమ కార్యకలాపాలను హైదరాబాద్ కు విస్తరించారు. ఈ యూనిట్ తమ వృద్ధిలో పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కె జయన్ వైస్ ఛైర్మన్ , సీఈఓ , వివిధ అంశాలలో సౌందర్య సంరక్షణను సరసమైనదిగా చేయడానికి దాని కార్యాచరణ పద్దతిని, విస్తరణ ప్రణాళికను వివరించారు.అంతర్గత నాణ్యతా ప్రమాణాలు, రోగి భద్రత మరియు ప్రక్రియ యొక్క పరిపూర్ణతను అందించే గ్రూప్ లక్ష్యాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గౌరీ శంకర్ పేర్కొన్నారు. క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ అనేది భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఉత్తమ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మరియు స్కిన్ క్లినిక్‌లలో ఒకటి, జుట్టు మరియు చర్మ సమస్యలతో బాధపడుతున్న ఎవరికైనా సరసమైన ధరలలో ఉత్తమ చికిత్సను అందిస్తుంది. క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ యుకె , దుబాయ్, షార్జా, మస్కట్ మరియు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శాఖలను కలిగి ఉంది. నేడు, క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ యొక్క నాణ్యతను 100000 కంటే ఎక్కువ మంది సంతృప్తి చెందిన కస్టమర్లు వేడుక జరుపుకుంటున్నారు.