– పేరెంట్స్ తో సత్సంబంధాలు కలిగి ఉండాలి
– ఢిల్లీ బృందం చే ఉపాధ్యాయులకు శిక్షణ
కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల సమ్మేటివ్ 1 అనాలసిస్ మరియు ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభోత్సవంలో కృష్ణవేణి టాలెంట్,
మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఉపాధ్యాయులు తమ నైపుణ్యతను ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూనే విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయగలరని కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని అన్నారు. ఆదివారం పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆ సంస్థ ఇంచార్జ్ డైరెక్టర్ అచ్చే నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల సమ్మేటివ్ 1 అనాలసిస్ మరియు ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభోత్సవంలో కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నైపుణ్యత కలిగిన ఢిల్లీ బృందంతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో రాజు మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య పెరిగేలా అడ్మిషన్స్ ఎలాచేయాలి, పేరెంట్స్ తో ఎలా మాట్లాడాలి, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు, గూగుల్, యూట్యూబ్, మరియు ఫేస్ బుక్ లో రేటింగ్స్ ఎలా ఉన్నాయి, పాఠశాలలో ఏ ఏ ఆక్టివిటీస్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రాజు సంగాని మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి వారిలో నిమిడి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సూచించారు. ఆ సంస్థ జోనల్ ఇన్చార్జి బుచ్చిరెడ్డి, ఎండి కాజా హుస్సేన్, అకాడమీ డైరెక్టర్ మురళి, శంకర్ పల్లి, భానూర్, పటాన్ చెరు, నారాయణఖేడ్, షాద్ నగర్ బ్రాంచ్ లతోపాటు బ్రాంచీల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.