నల్లగండ్ల లో అమ్జద్ హబీబ్ సలోన్స్ ను ప్రారంభించిన సినీనటి శ్రద్ధ దాస్

Hyderabad Lifestyle Telangana

ఎపుడు హ్యాపీ ఉండడమే నా గ్లామర్ సీక్రెట్ 

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : 

ప్రసిద్ధ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, అమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడైన అమ్జద్ హబీబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్స్ ఫ్రాంచైజింగ్‌ను హైదరాబాద్ నల్లగండ్ల లో సినీనటి శ్రద్ధ దాస్, వంశీకృష్ణ(మహా న్యూస్ ఎమ్.డి) మరియు జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్) ప్రారంభించారుఅమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో, మా సలోన్స్ విజయవాడ, మియాపూర్, హైదరాబాద్‌లో ఇప్పుడు ప్రారంభం అయ్యాయని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు ఉన్నాయన్నారు. అన్ని ప్రధాన నగరాల్లో ఫ్రాంచైజ్ కోసం ఎవ్వరికైనా కావాలంటే ఇస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తమ బ్రాండ్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని హైదరాబాద్‌లో చంచల్‌గూడ జైల్లో ఖైదీలకు ట్రైనింగ్ ఇస్తున్నానని తెలిపారు.

మహేష్ బిజినెస్ హెడ్ ఆపరేషన్స్ మరియు నిర్వాహకులు సాయి మాట్లాడుతూ అమ్జద్ హబీబ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ & వ్యవస్థాపకుడు, 16 సంవత్సరాల పాటు డా. ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్, చాలా బాలీవుడ్ సెలబ్రిటీల స్టైలిస్ట్ అని బ్రాండ్ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సలోన్స్ ప్రీమియం క్వాలిటీ ఉత్పత్తులు ఉపయోగించి అసాధారణ హెయిర్ కేర్ సేవలను అందిస్తాయన్నారు. కొత్త అందాల ట్రెండ్స్‌లో ముందంజలో ఉంటాయని చెప్పారు. ఫ్రాంచైజ్ వివరాల కోసం ఈ నెంబర్లలో 970 499 7786, 729 887 8888 సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *