వ్యర్థాల నిర్వహణపై అంతర్జాతీయ సదస్సు

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

‘వ్యర్థాల నిర్వహణ – వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, ఐపీఎల్ఏ అంతర్జాతీయ ఫోరమ్ 2024’పై 14వ అంతర్జాతీయ సదస్సును గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చలు, విజ్జాన భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి ఈ యేడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ సదస్సును హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ఈ సమావేశంలో వ్యర్థాల నిర్వహణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక ఇతివృత్తాలు, వ్యర్థాలు, విధానాలు, నిబంధనలు, ఇంజనీరింగ్, సాంకేతికత, సామాజిక, వ్యాపారం, పరిశ్రమలు, వ్యవస్థాపకత వంటివి ఉంటాయని తెలియజేశారు. సదస్సులో భాగంగా కీలకోపన్యాసాలు, ప్లీనరీ చర్చలు, ప్రత్యేక సాంకేతిక కార్యక్రమాలు, ప్యానెల్ చర్చలు వంటివెన్నో ఉంటాయన్నారు.విద్యారంగ ప్రతినిధులు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలో పనిచేసేవారు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు, ఆరోగ్య పరిరక్షణ సంస్థలు, ఇతర ఆసక్తి గలవారు ఈ సదస్సులో పాల్గొనవచ్చని తెలియజేశారు. నిర్దిష్ట ప్రవేశ రుసుము చెల్లించి వ్యక్తిగతంగా లేదా ఆన్-లైన్-లో ఈ సదస్సుకు హాజరు కావచ్చని, అలాగే కాన్ఫ-రెన్స్ ఈ-ప్రొసీడింగ్-లను కూడా ప్రచురిస్తామన్నారు.ఈ సదస్సుతో పాటు, స్కూల్ కాంగ్రెస్, హ్యాకథాన్, ఇండస్ట్రీ ఎక్స్-పో, ప్రీ-కాన్ఫరెన్స్ డాక్టోరల్ వర్క్-షాపులను నవంబర్ 27న నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ సాధన్ కె.ఘోష్ 98300 44464, నిర్వాహకుడు డాక్టర్ వై.ఎల్.పీ. థోరన్ల్ 888 678 5076లను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *