పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్-లో శుక్రవారం ‘ప్రపంచ వాస్తుశిల్పుల దినోత్సవా’న్సి ఎంతో ఉత్సాహభరితంగా, సందడిగా నిర్వహించారు. పర్యావరణంతో పాటు జన సమూహాలకు సేవలందించడంలో ఆర్కిటెక్చర్ పోషిస్తున్న కీలక పాత్రను గుర్తించే లక్ష్యంతో దీనిని జరుపుకున్నారు. భవనాల రూపకల్పన, పట్టణ ప్రణాళికలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను వెలికితీసి, వాటిని ఇతరులతో పంచుకోవడాన్ని ప్రోత్సహించారు.ఆర్కిటెక్చర్ విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించే అద్భుతమైన ఫోటోగ్రఫీ ప్రదర్శనతో ఈ వేడుకలు ఆరంభమయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి సేకరించిన అద్భుత నిర్మాణాల ఛాయా చిత్రాలను ప్రదర్శించారు. కనులకు ఇంపుగా ప్రదర్శించే నైపుణ్యాలను ఈ ప్రదర్శన తేటతెల్లం చేయడమే గాక, వాటి క్లిష్టమైన వివరాలను, అద్భుత నిర్మాణ పనితీరు, పరిసరాలతో దానికున్న అనుబంధాన్ని ఆ చిత్రాలు ప్రస్ఫుటీకరించాయి.
ఈ ప్రదర్శన తరువాత, ‘పట్టణ ప్రణాళిక, మహిళల భద్రత’ అనే అంశంపై చర్చాగోష్ఠిని నిర్వహించారు. మహిళ లకు అభద్రతా భావానికి దోహదపడే పట్టణ రూపకల్పనలో ఎదురవుతున్న సవాళ్లను విద్యార్థులు ఈ సందర్భంగా చర్చిం చారు. పట్టణ ప్రదేశాలలో భద్రతను పెంపొందించడంలో ఆర్కిటెక్చరల్ డిజైన్ పాత్రపై మంచి అవగాహనను ఏర్పరచుకు న్నారు. లింగ-సున్నితమైన పట్టణ ప్రణాళిక గురించి ఆలోచనాత్మక, ఉద్వేగభరితమైన సంభాషణలకు ఈ చర్చ దారితీసింది.ఆలోచింపజేసే ఆర్కిటెక్చరల్ డాక్యుమెంటరీ ప్రదర్శనతో వేడుక ముగియడమే గాక, వాస్తుశిల్పం యొక్క విస్తృత సామాజిక ప్రభావాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులను మరింత ప్రోత్సహించింది. ఆర్కిటెక్చర్-లో సమగ్ర రూపకల్పన ప్రాముఖ్యత గురించి సృజనాత్మకత, అవగాహన రెండింటినీ పెంపొందించడం ద్వారా అర్థవంతమైన చర్చలలో పాల్గొనే వేదికగా ఉపకరించింది. చివరగా విజేతలు, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. దీనిని అసిస్టెంట్ ప్రొఫెసర్ తపతి తపన్విత భంజా, విద్యార్థి బృందం శివాని, ముస్కాన్, అనుశ్రీ, భవ్య సమన్వయం చేశారు.