మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
రజక సంఘం రాష్ట్ర కమిటీ నీ శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మియాపూర్ ఇంధ్రారెడ్డి అల్విన్ కాలనీ కార్యాలయం లో జరిగిన సమావేశం లో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా లక్ష్మి, ఉపాధ్యక్షులు గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గా నాగేశ్వర్ రావు, జాయింట్ సెక్రెటరీ విఘ్నేశ్, కోశాధికారి వీరబాబు, కమిటీ సభ్యులు గా దుర్గ, శివ నారాయణ లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మి మాట్లాడుతూ రజకులు ఎదురకొంటున్న సమస్యలను ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. చెరువుల్లో దోబీ ఘాట్ల నిర్మాణం చేపట్టి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కారిణి చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో పెద్దమ్మ తల్లి రజక సంఘాన్ని ఏర్పాటు చేశామని అందరి అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.