పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని, యోగా మన మనస్సునే కాదు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముదిరాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్రస్థాయి యోగ పోటీలను శుక్రవారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆరోగ్యాన్ని పొందడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాల కారణంగా యోగ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. పాఠశాల స్థాయి నుండి యోగాపై శ్రద్ధ పెరిగేలా కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగ అభ్యాసనాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తులసీదాస్, కుమార్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రావు, ప్రధాన కార్యదర్శి కృపాకర్, జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.