బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో కలశ యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరై కలశ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక దుర్గామాత ఆలయంలో చంద్రారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలను మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరి ఆచార సంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులను స్థానిక మహిళలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మా రెడ్డి గారు, మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆనంద్ కృష్ణ రెడ్డి , స్థానిక నాయకులు రమణయ్య , రాజ్ గోపాల్ , దిననాధ్ , జె.జె సింగ్ గారు, రాజారామ్, శ్రీమన్నారాయణ , చంద్రశేఖర్ , శ్రవణ్ , మా అంబి మహిళా సేవాసమితి సభ్యులు దుర్గవతి , పరంశీల , ప్రమీల దేవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.