చిట్కుల్లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అహింస సిద్ధాంతమే ఆయుధంగా ఆంగ్లేయుల కబంధహస్తాల నుంచి భారత దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మహాత్మ గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నీలం మధు ముదిరాజ్ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం అందించడం కోసం అహింసా పద్ధతిలో శాంతియుతంగా పోరాటం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అన్నారు. గాంధీజీ ఎంచుకున్న శాంతి అహింస మార్గం భారతీయులకే కాదు ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. అలాంటి మహోన్నత బాపూజీ మార్గం నుంచి నేటి యువత స్ఫూర్తి పొంది ఆయన బాటలో పయనించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇఓ కవిత , మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్, మాజి ఉపసర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి,వి నారాయణరెడ్డి,కృష్ణ,చాకలి వెంకటేశ్,తదితరులు పాల్గొన్నారు.