పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ లో గల మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస పద్ధతుల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన మహోన్నత నాయకుడు మాత్మ గాంధీ అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. నేటి తరాలకు మహాత్మా గాంధీ చరితను తెలియజేసే విధంగా ప్రతి గ్రామపంచాయతీ ఆవరణలో విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా వారం రోజులపాటు నిర్వహించిన పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు అఫ్జల్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.