గీతమ్ లో స్వచ్చ భారత్ అభియాన్

Telangana

విద్యార్థులు, వాలంటీర్లను ఉత్సాహపరుస్తూ స్వయంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మన దేశ ప్రధాని దార్శనికత, స్వభావ స్వచ్చత సంస్కార స్వచ్చత (ఫోర్ ఎస్) ప్రచారానికి అనుగుణంగా, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో స్వచ్చ భారత్ అభియాన్ ను మంగళవారం చేపట్టింది. స్వచ్చ భారత్ మిషన్ పదో వార్షికోత్సవ వేడుకలలో భాగంగా సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 2న మహాత్మా గాంధీ జయంతితో ముగుస్తుంది. దీనిని పురస్కరించుకుని గీతం ఆతిథ్య (హాస్పిటాలిటీ) విభాగం నేతృత్వంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్, పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్చతా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు. స్వచ్చ భారత్ అభియాన్ కేవలం పరిశుభ్రత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన గౌరవాన్ని మనం పెంపొందించుకోవడమేనన్నారు.పరిశుభ్రత ప్రతిజ్ణ తరువాత గీతం ప్రాంగణం పరిసరాల్లోని రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరిచారు.

తమ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రంగా ఉంచడమే గాక ప్రజల భాగస్వామ్యం, వారికి దీనిపై అవగాహన కల్పించడం, శుభ్రతను పెద్దయెత్తున చేపట్టడం, పారిశుధ్య కార్మికుల సంక్షేమం వంటి విస్త`త లక్ష్యాలకు ఇది దోహదపడింది అనడంలో అతిశయోక్తి లేదు.కోర్ ఇంజనీరింగ్ డీన్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ అంబికా ఫిలిప్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్ర కుమార్ తదితరులు వాలంటీర్లు, విద్యార్థుల ఈ సామాజిక ప్రయత్నాన్ని ప్రశంసించారు. స్వచ్చత, శుభ్రతలో విద్యార్థుల సహకారం ప్రాముఖ్యతను వారు వివరించారు.ఈ కార్యక్రమం పరిశుభ్రత, ప్రజారోగ్యం ప్రాముఖ్యతను బలోపేతం చేయడమే గాక, సామాజిక బాధ్యత, జాతీయ ప్రచారాలలో చురుకైన సమాజ ప్రమేయం పట్ల గీతం నిబద్దతను ప్రతిబింబిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *