గీతమ్ ఎన్ సీసీ యూనిట్ ను తనిఖీచేసిన కమాండర్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని ఎన్ సీసీ యూనిట్ ను నిజామాబాద్ లోని 33 (తెలంగాణ) బెటాలియన్ ప్రధాన కార్యాలయ కమాండర్ కల్నల్ సునీల్ అబ్రహం శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన వెంట 33 (తెలంగాణ) బెటాలియన్, సంగారెడ్డి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రమేశ్ సిరియాల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి.మధుసూదనరావు కూడా ఉన్నారు.తనిఖీ సందర్భంగా, కల్నల్ సునీల్ అబ్రహం గీతం ఎన్ సీసీ క్యాడెట్లతో ముఖాముఖి చర్చించడంతో పాటు, వారి అత్యుత్తమ పనితీరును ప్రశంసించారు. ఉన్నత ప్రమాణాలను చేరుకోవడానికి స్థిరమైన శిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సామాజిక సేవకు మాత్రమే కాకుండా దేశ నిర్మాణంలో కూడా ఇరోధికంగా సహకరిస్తున్న ఎన్ సీసీ ప్రయోజనాలను సహ-పాఠ్య కార్యకలాపంగా ఆయన అభివర్ణించారు. ఎన్ సీసీ సర్టిఫికేట్ కలిగి ఉండడం వల్ల విద్యార్థి బయోడేటా విలువ గణనీయంగా పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలను 30 శాతం పెంచుతుందని, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో వెయిటేజిని అందజేస్తుందని క్యాడెట్రక్కు కల్నల్ వివరించారు. సాయుధ దళాలలో ప్రత్యేక ప్రవేశ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ సీసీ క్యాడెట్లకు పోలీసు ఉద్యోగాలలో ఐదు శాతం వెయిటేజీని మంజూరు చేస్తున్నట్టు కల్నల్ సునీల్ వెల్లడించారు.ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ శిబిరాలలో పాల్గొనడానికి ఎంపికయిన సలువురు గీతం ఎన్ సీసీ క్యాడెట్లను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

మహిత కొండూరి యువత మార్పిడి కార్యక్రమం-2024-25కు ఎంపికై నేపాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.

అబ్దుల్ హదీ పరీక్, నికేత్ సుందరాశెట్టి, మహితా కొండూరి, శిఖా సింగ్ రాథోడ్ లు సర్వీస్ సెలక్షన్
బోర్డ్ శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యారు.

ఎస్.రిత్విక, కె. కీర్తలు లక్షద్వీప్, కాకినాడలలో నిర్వహించనున్న ప్రత్యేక జాతీయ సమగ్రత శిబిరానికి ఎంపికయ్యారు.

ముకుల్ అస్సాంలోని స్పెషల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ కు ఎంపికయ్యాడు.

గణతంత్ర వేడుకలలో పాల్గొనే వారి తుది విడిత ఎంపిక చేయడం కోసం నిజామాబాద్ నిర్వహించనున్న క్యాంపుకు గోవిందు లిఖిత, ధరణికోట జీశాంతిక, శౌర్య కొండపల్లి ఎంపికయ్యారు. తొలుత, కల్నల్ సునీల్ అబ్రహంను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీసిస్ఎస్ఆర్ వర్మ, ఎన్ సీసీ అధికారి ఎస్. అజయ్ కుమార్ లు స్వాగతించి, సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *