పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామపంచాయతీ ఆవరణలో గల గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఉత్సవాల్లో నాయకులు,అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ లో ప్రజా పాలన నడుస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, సమ న్యాయం ప్రధాన ఎజెండా గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. దొరల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ఈ రోజును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటూ, ఇందిరమ్మ పాలనను గుర్తుకు తీసుకువస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి చేస్తూ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రెండు లక్షల రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిన ఘనత రేవంత్ సర్కార్కు దక్కుతుందన్నారు. ప్రజా పాలనలో భాగంగా నూతన రేషన్ కార్డుల మంజూరు తో పాటు తెలంగాణలో ప్రతి కుటుంబానికి పూర్తి ఆరోగ్య వివరాలతో హెల్త్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాల శౌరీ,ఈఓ కవిత , వి నారాయణ,వెంకటేశ్, మురళీ, పొట్టి నారాయణ రెడ్డి,శ్రీను,గోపాల్, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.