ప్రొడక్ట్ ఇంజినీరింగ్ లాబొరేటరీ’ని ప్రారంభించిన టీ-వర్క్స్ సీఈవో
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వంలోని టీ-వర్క్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జోగిందర్ తనికెళ్ల మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అత్యాధునిక ‘టెక్నాలజీ ఎక్స్ పో రేషన్ అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ లాబొరేటరీ’ (టీఈ సీ)ని ప్రారంభించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల, ఎంఎస్ ఎంఈ నోడల్ అధికారి అరవింద్ బాబుల సమక్షంలో దీనిని నిర్వహించారు.వాస్తవ ప్రపంచ సమస్యలతో పాటు సరికొత్త సాంకేతికతలతో దేశంలోని యువతను సన్నద్ధం చేయాల్సిన అవసరాన్ని జోగీందర్ నొక్కి చెప్పారు. పరిశ్రమ ఆధారిత పాఠ్యాంశాలతో పాటు గణనీయమైన అనుభవం, ఇంటర్న్ షిప్ లతో పరిశ్రమకు సిద్ధంగా ఉన్న సాంకేతిక విద్యార్థులను తయారు చేయడం గీతం వంటి విశ్వవిద్యాలయాల ప్రాముఖ్యత అని చెప్పారు.సుమారు రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రొఫెసర్ శాస్త్రి తెలిపారు. విద్యార్థులకు ప్రయోగాత్మక అభ్యాస అనుభవాన్ని అందించడానికి, వారి వినూత్న, సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వారి ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసాన్ని మెరుగుపరచడానికి దీనిని రూపొందించినట్టు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏదెనా విద్యా సంస్థ/ విశ్వవిద్యాలయంలో ఇటువంటి ల్యాబ్ ను నెలకొల్పిన దాఖలాలు లేవని, ఇదే మొదటిదని ఆయన అన్నారు.
టీఈసీ ల్యాబొరేటరీ ద్వారా గీతం తొలి ఏడాది బీటెక్ విద్యార్థులందరూ వివిధ యంత్రాలు, పవర్ టూల్స్, మెకానిజమ్స్, కంట్రోల్ యూనిట్లు, ప్రాథమిక ఎలక్ట్రానిక్స్, మెక్రోకంట్రోలర్లు, సెన్సార్లు, మోటార్లు, సంపులు మొదలైన వాటిని వినియోగించడంలో తర్ఫీదు పొందుతారన్నారు. ఈ ప్రయోగశాలలో రూటింగ్ సీఎన్సీ మెషిన్, డెల్టా ట్రాప్ లేత్ కమ్ మిల్లింగ్ కమ్ డ్రిల్లింగ్ మెషీన్, వుడ్ బర్నింగ్ రత్, ఎంబజ్ వెల్డింగ్ మెషిన్, ఈడీఎం వెర్ట్ కట్ మెషిన్, లేజర్ కట్టింగ్ మెషిన్, బ్రీడీ స్కానర్, వివిధ రకాలైన సీసీబీ ప్రోబో ప్రింటర్లు వంటివెన్నో అత్యాధునిక పరికరాలు ఉన్నాయని డాక్టర్ శాస్త్రి పేర్కొన్నారు.ఒక ప్రాజెక్టులో భాగమైన ఆలోచన, నమూనా, పరీక్ష, ధ్రువీకరణ నుంచి ప్రాజెక్టును పూర్తిచేసి, దానిని ప్రదర్శించేలా విద్యార్థులకు మార్గనిర్దేశం ఉంటుందని తెలిపారు.
పవర్ టూల్స్ తో పాటు మెకానికల్ కార్యకలాపాలను నిర్వహించడం, ఐనోటీ భావనలను అర్థం చేసుకోవడం, అన్వయించడం, వాస్తవ- ప్రపంచ సమస్యలకు బహుళ- క్రమశిక్షణా ఇంజనీరింగ్ నైపుణ్యాలను వర్తింజేయడం, ఆవిష్కరణ, వ్యవస్థాపకతను సంపాదించడం వంటివి ఈ ల్యాబ్ నుంచి విద్యార్థులు నేర్చుకుంటారని ప్రొఫెసర్ రామశాస్త్రి వివరించారు.ఈ ల్యాబొరేటరీని ప్రారంభించడం వల్ల విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని సంపొందించడంతో పాటు భౌతిక ప్రాజెక్టులను వారు స్వయంగా చేపట్టి, అభివృద్ధి చేయడానికి, ఇంజనీరింగ్, టెక్నాలజీలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు వారిని సిద్ధం చేసే నైపుణ్యాలను అందించాలని భావిస్తున్నారు.