మానవ జీవితంలో భాగమవుతున్న రోబోలు

Telangana

గీతం సెమినార్ లో ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ రేఖా రాజా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇళ్ల పరిశుభ్రత నుంచి రిసెప్షనిస్టులు, వెయిటర్లగా పనిచేస్తున్న సామాజిక రోబోల వరకు మానవ జీవితంలో రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాముఖ్యత పెరుగుతోందని, ఒకరకంగా రోబోట్లు మానవ జీవితంలో భాగమవుతున్నా యని ఐఐటీ హైదరాబాద్ లోని కృత్రిమ మేథ (ఏఐ) విభాగానికి చెందిన డాక్టర్ రేఖా రాజా అన్నారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో ఈనెల 12-13 తేదీలలో ‘రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్’ (ఆర్ వోఎస్)పై నిర్వహించిన రెండు రోజుల జాతీయ చర్చాగోష్ఠిలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సెమినార్ లో రోబోటిక్స్ పరిచయం, ఆర్ వోఎస్ ప్రాథమిక సూత్రాలు, సిమ్యులేషన్ (అనుకరణ), విజువలైజేషన్, రోబోట్ ప్రోగ్రామింగ్ వంటి కీలక అంశాలపై బీటెక్ రోబోటిక్స్ అండ్ ఏఐ విద్యార్థులకు అవగాహనను కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ రేఖ మాట్లాడుతూ, మున రోజువారీ జీవితంలో భాగమువుతున్న రోబోట్లు మనం మాట్లాడే భాషను అర్థం చేసుకోవడం, వాటికి అమర్చిన సెన్సార్లు, కెమెరాల ద్వారా సజావుగా ప్రతిస్పందించడం. అవసరమని చెప్పారు.

ఈ ప్రక్రియ ఆర్ వోఎస్ ద్వారా ప్రారంభించారని, వాటిని ఈ సెమినార్ ద్వారా విద్యార్థులు. అనుభవ పూర్వకంగా అనగతం చేసుకుని, ఈ అధునాతన వ్యవస్థను ఉపయోగించి రోబోలను అదుపు చేయగలరని అన్నారు.నెదర్లాండ్స్ లోని వాగెనింగిన్ విశ్వవిద్యాలయానికి చెందిన అక్షయ్ కుమార్ బురుసా, ముఖ్యంగా వ్యవసాయంలో రోబోటిక్స్ వినియోగిస్తున్న తీరును వివరించారు. వ్యవసాయంలో తరచుగా కనిపించే సంక్లిష్టమైన, నిర్మాణాత్మకమైన వాతావరణాలను నిర్వహించగల సామర్థ్యం గల రోబోట్లను అభివృద్ధి చేయడానికి ఆర్ వోఎస్ ఎలా. ఉపయోగిస్తున్నారనే దానిపై పలు అంతర్గత విషయాలను ఆయన విద్యార్థులతో పంచుకున్నారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య అతిథులను స్వాగతించి, సత్కరించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు ప్రొఫెసర్ సి.శ్రీనివాస్, ప్రొఫెసర్ సి.ఈశ్వరయ్యల మార్గదర్శనంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఏ. కిరణ్ కుమార్, డాక్టర్ జయప్రకాష్ శ్రీవాస్తవ ఈ రెండు రోజుల జాతీయ సెమినార్ ను సమన్వయం చేశారు. బీటెక్ రోబోటిక్స్ అండ్ ఏఐ విద్యార్థులతో పాటు రోబోటిక్స్ పట్ల ఆసక్తి ఉన్న ఇతర విద్యార్థులు కూడా ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *