– పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
– రూ.1 కోటి 30 లక్షల నిధుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో రూ.1 కోటి 30 లక్షల నిధులతో చేపట్టనున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ స్మశాన వాటికలకు ప్రహరీ గోడ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయంలో స్మశాన వాటిక పరారీ గోడ నిర్మాణ పనులకు నిధులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో, పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. ప్రహరీ గోడ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. రాజకీయాలకతీతంగా పటాన్ చెరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.