మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షునిగా రెడ్యానాయక్ చెల్లదని పత్రికా ప్రకటన ను ఖండిస్తున్నామనీ నడిగడ్డ తాండ వాసులు తెలిపారు.నడిగడ్డ తాండ లో గిరిజన సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు మాత్రమే ఎన్నుకుంటారనీ, కొంతమంది తండా ఎన్నికల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత గెలవమని ఉద్దేశంతో అందరు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు గా రెడ్యా నాయక్ అధ్యక్షుడు అని తప్పుడు సమాచారంతో తాండ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తo చేశారు. తాండలో ఎవరు అతనికి ఏకీగ్రీవంగా తీర్మానం చేయలేదనీ, నడిగడ్డ తండాలో 800 కుటుంబాలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకుంటారు ఎవరు వాళ్ళు ప్రకటించుకుంటే భవిష్యత్తులో ప్రజలు వాళ్లకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఎవరు ఇలా చేసినా సరైంది కాదని, తప్పుగా ఇచ్చిన పత్రిక ప్రకటనను తండా వాసులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఎస్ హన్మ నాయక్, ఎన్ దేవా నాయక్, నాయిని రత్న కుమార్, రమేష్ తేజవత్ బాలు నాయక్ , సోమేశ్ తదితరులు ఖండించారు.నడిగడ్డ తాండ నూతన అధ్యక్షునిగా తండా ఎన్నికల కమిటీ మాత్రమే అధికారికంగా ప్రకటన చేస్తుందనీ, ఎవరు పత్రిక ప్రకటన ఇచ్చిన పూర్తి విషయాలు తెలుసుకొని పత్రిక ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.