మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలో గల మియాపూర్ డివిజన్ మక్త విలేజ్ లో బిజెపి నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని , బీజేపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మల్లేష్, నరేష్, హరీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.