మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ వ్యర్థ సామాగ్రి, సిమెంట్ కాంక్రీట్ ను శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో గల నానక్ రామ్గూడ లోని లోధా బస్తీ వద్ద రోడ్డుపై కాంక్రీట్ డంపింగ్ వేసిన కారణంగా సుమధుర నిర్మాణంపై 25వేలు జరిమానా విధించినట్లు జి హెచ్ ఎం సి సూపరిండెంట్ జే. లెనిన్ బాబు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఎస్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిమానా విధించారు