పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తక్కువ వోల్టేజ్ అధికశక్తి సమకాలిక బక్ కన్వర్టర్ రూపకల్పన, మోడలింగ్, విశ్లేషణలపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హై దరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి జడపల్లి శ్రీధర్ కు డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. వారణాసిలోని ప్రఖ్యాత ఐఐటీ (బీహెచ్ఐయూ) ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యుడు ప్రొఫెసర్ మిత్రేష్, కుమార్ వర్మ దీనికి బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు.జడపల్లి శ్రీధర్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఆదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్-కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.ఆర్. శాస్త్రి, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టీ.మాధవి, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
