గణితంపై పట్టు – విజయానికి తొలి మెట్టు

Telangana

-పాఠశాల విద్యార్థులకు గణితం, సెన్స్ ప్రాముఖ్యతలను వివరించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వ్యక్తుల విశ్లేషణాత్మక సామర్థ్యాలను రూపొందించడంలో, పోటీ పరీక్షలను వారిని సిద్ధం చేయడంలో గణిత శాస్త్రం క్రియాశీలక భూమిక పోషిస్తోందని, గణితంపై పట్టు విజయానికి తొలి మెట్టుగా గీతం విద్యార్థులు అభివర్ణించారు.గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విద్యార్థులు మంగళవారం రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం, సెన్స్ ప్రాముఖ్యతను వివరించడానికి ఉద్దేశించిన ఔట్రచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని గణిత శాస్త్ర విభాగం నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు గీతం విద్యార్థులు పాల్గొని, గణితం, సెన్స్ లపై ప్రేమను పెంపొందించడంతో పాటు చొరవను కొనసాగించాల్సిన ఆవశ్యకతను కార్యక్రమ సమన్వయకర్త, గణిత శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పాశం నరసింహస్వామి మాట్లాడుతూ, వివిధ రంగాలలో విజయానికి అవసరమైన విమర్శనాత్మక ఆలోచనా నైఫుణ్యాలను పెంపొందించడంలో గణిత శాస్త్రం: పాత్రను నొక్కి చెప్పారు. తమ ఈ ప్రయత్నానికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారం అవసరమని డాక్టర్. స్వామి అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో రుద్రారం ఉన్నత పాఠశాలకు చెందిన 120 నుంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రణవి, షాజియా, చందన, కార్తీక ల నేతృత్వంలో సుమారు ఇరవై మంది గీతం విద్యార్థులు ఈ కార్యక్రమం సఫలం కావడానికి కృషి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *