వాతవరణ మార్పు ఎన్నికల ప్రచారాంశం కావాలి

Telangana

_గీతం అతిథ్య ఉసన్యాసంలో అభిలషించిన ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ డి.పార్థసారథి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల వల్ల ప్రకృతిలో ప్రమాదకరమైన మార్పులు సంభవిస్తున్నాయని, అది ఎన్నికల ప్రచారాంశం కావాలని ఐఐటీ బొంబాయిలోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ప్రొఫెసర్ డి.పార్థసారథి అభిలషించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ లోని సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు, ప్రజా సమూహాలు, ఎన్నికలు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను, కష్టాలను ఎన్నికల సమస్యగా సాధారణ ప్రజలు ఎందుకు లేవనెత్తడం లేదో అర్థం చేసుకోవడానికి ఈ చర్చ కొనసాగించారు.యువతలో వాతావరణంపై అవగాహనను పెంచే సందర్భంలో వాతావరణ న్యాయం యొక్క అర్థం, ఆవశ్యకతపై డాక్టర్ పార్థసారథి అవగాహన కల్పించారు.

ప్రపంచ సహకారం, ప్రాంతీయ ఒప్పందాలు, స్థానిక క్రియాశీలతను ప్రోత్సహించడంపై దృష్టి సారించే కొత్త విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం నిపుణుల చర్చలు, శాస్త్రీయ చర్చలకు పరిమితమైన రోజువారీ సంభాషణలలో వాతావరణ మార్పులను భాగం చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.తొలుత, జీఎస్ఏహెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోప్మాన్ జోస్ అతిథిని ఆహ్వానించి, సత్కరించారు. సోషియాలజీ విభాగం సమన్వయకర్త డాక్టర్ అవినాష్ అతిథి స్వాగతించగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రోమా భట్టాచార్య నందన సమర్పణ చేశారు.సామాజిక, పర్యావరణ సమస్యలను ఎత్తిచూపి, సానుకూల సూర్పును తీసుకురావడానికి నిపుణులను ఒకచోట చేర్చి, ఆయా అంశాలపై చర్చలను జీఎస్ హెచ్ఎస్ నిర్వహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *