50 లక్షల రూపాయల సొంత నిధులతో ధ్యాన మందిరం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం పెంపొందించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సిద్ధి గణపతి దేవాలయం ఆవరణలో 50 లక్షల రూపాయల సొంత నిధులచే ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని గురువారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని గ్రామాలలో నూతన దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మించి ప్రతి ఒక్కరిలో పరమత సహనాన్ని పెంపొందించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.