పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బల్దియా పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా గా నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని పటాన్చెరు సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీలో 68 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డివిజన్లో పరిధిలో పురాతన రహదారులు తొలగించి నూతన రోడ్లు నిర్మించడంతోపాటు నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.