పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కార్మికుల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్న బి.ఆర్.టి.యు కార్మిక సంఘాన్ని బలపరిచి, మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెన్నార్ పరిశ్రమ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ నెల 6వ తేదీన పెన్నార్ పరిశ్రమంలో జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో గల పెన్నార్ పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ఎంతో నమ్మకంతో బిఆర్టియూ నాయకత్వాన్ని బలపరిచారని, ఇందుకు అనుగుణంగా కార్మికులకు మెరుగైన వేతనం ఒప్పందం అందించడంతో పాటు వివిధ సౌకర్యాలు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో పనిచేసిన కార్మిక సంఘాలకు విభిన్నంగా పనిచేయడంతో పాటు ప్రతి కార్మికుడి సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి గంట గుర్తుపై ఓటు వేసి బి ఆర్ టి యు ని గెలిపిస్తే అందరికీ ఆమోదయోగ్యమైన వేతన ఒప్పందం చేయించడంతోపాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందించడం, నిష్పక్షపాతంగా ప్రతి కార్మికుడికి సకాలంలో ప్రమోషన్లు అందించేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు, పెన్నార్ కార్మిక సంఘం అధ్యక్షులు రాంబాబు యాదవ్, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మండలం అధ్యక్షులు పాండు, కార్మిక సంఘం ప్రతినిధులు ఎన్ వి రావు, లక్ష్మారెడ్డి, సోమేశ్వర్, పెంటయ్య, వెంకటేశ్వర్లు, మహేష్, జానకిరామ్, రామ్ మోహన్ రావు, శ్రీ రామ్ సింగ్, బి వి రావు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
