పెన్నార్ పరిశ్రమంలో సిఐటియు నే గెలిపించండి_ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్

politics Telangana

– మెరుగైన వేతన ఒప్పందం సిఇటియు కే సాధ్యం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కార్మికుల కష్టసుఖాల్లో వెన్నంటు ఉండే సిఐటియునే గెలిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ పెన్నార్ కార్మికులకు పిలుపునిచ్చారు.పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం రాత్రి జరిగిన పెన్నార్ పరిశ్రమ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇస్నాపూర్ ఎంపీటీసీ సభ్యులు గడ్డం శ్రీశైలం లు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్నార్ పరిశ్రమలో బిఆర్ టీయు అధికార గుర్తింపుగా యూనియన్ గా ఉండి ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని, వేతన ఒప్పందాన్ని మోసం చేసిందని, దగా చేసిందని వారు విమర్శించారు. పరిశ్రమలో కార్మికులకు వేధింపుల తో పాటు మెమోలు ఎక్కువైనాయని ఆరోపించారు , క్యాంటీన్ రేట్లు పెంచారని, కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారానికి నోచుకోకపోవడం దారుణం అన్నారు, కార్మికుల సమస్యల మీద అవగాహన ఉన్న సంఘం సీఐటీ యు నేనని పెన్నర్ పరిశ్రమంలో మంచి వేతన ఒప్పందం, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సీఐటీయూ నే గెలిపించాలని కార్మికులందరిని ఈ సందర్భంగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి మల్లేష్, ఉపాధ్యక్షులు కే రాజయ్య, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు, పెన్నార్ పరిశ్రమ నాయకులు శేషగిరి, త్రిమూర్తులు, రాజు, జయ కుమార్, పాండురంగారెడ్డి, ఐ ఎన్ టి సి నాయకులు రెహమాన్, శివపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *