అన్ని వర్గాల అభివృదే ప్రధాన లక్ష్యం

politics Telangana

_బీసీ ఐక్యవేదిక క్యాలెండర్ ఆవిష్కరణ లో జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

అన్ని వర్గాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని శేరిలింగంపల్లి ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రూపొందిoచిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్, ఫెడరేషన్ అధ్యక్షులు సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి అధ్యక్షులు అడ్వకెట్ రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ముద్దంగుల తిరుపతి, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ ల తో కల్సి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మెమెంతో మాకంతా అన్న విధంగా తెలంగాణ శాసనసభ కులగణన తీర్మానాన్ని చేయడం చాలా సంతోషన్నారు.కుల గణన నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించిన వారoదరికీ బీసీ ఐక్యవేదిక సభ్యులు ధన్యవాదాలు. తెలిపారు.,కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదని, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే ,బడుగు బలహీన వర్గాలు సామాజిక, రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రిసిడెంట్ కె.ఎల్..ఎం.స్వామీ, బిసి ఐక్యవేదిక అడ్వకేట్ చైర్మన్ షేక్ జాకిర్ హుస్సేన్,వీరేందర్ గౌడ్,భేరి రామచందర్ ,నర్సింలు ముదిరాజ్, మక్బుల్ భాయ్, నవాజ్, సెల్వరాజ్, సుజాత, పార్వతి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *