గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన గీతం విద్యార్థిని

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ ఎస్ ) లోని విజువల్ కమ్యూనికేషన్స్ బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థిని భావరాజు నందిని న్యూఢిల్లీలో జనవరి 26న నిర్వహించిన 75వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకల సాంస్కృతిక ప్రదర్శనలో తన ప్రతిభ చాటారు. ఈ విషయాన్ని ఆమె అధ్యాపకురాలు సంధ్యా గాండే శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి తరలి వచ్చిన అతిథులు, పలువురు రాయబారులు, పౌర, సైనిక ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో గీతం విద్యార్థిని పాల్గొని, తన కళా నెపుణ్యాన్ని ప్రదర్శించడం ఓ మరుపురాని అనుభూతిగా ఆమె అభివర్ణించారు. ఆమె కళాభినయానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయని, ఇది గీతమ్ లో పెంపొందించిన సాంస్కృతిక చైతన్యం. కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.  ప్రతిష్టాత్మక గణతంత్ర వేడుకలలో ఎన్ సీసీ కేడటగా కళాభినయాన్ని ప్రదర్శించే అనకాశం అందుకున్న భావరాజు నందినిని గీతం,హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, జీఎస్ హెచ్ ఎస్ డైరక్టర్ సన్నీ గోస్మాన్ జోస్, పలువురు విభాగాధిపతులు, ఆధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించినట్టు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సాంస్కృతిక కార్యక్రమానికి నందినిని సిద్ధం చేయడంలో తనవంతు సహకారం అందించినట్టు అధ్యాపకురాలు సంధ్యా గాండే ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *