మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
చెట్ల నరికివేత సందర్బంగా బుధవారం రోజు 11కేవీ ఫీడర్ పరిధిలోని జేపీ నగర్ ఫీడర్ మదీనగూడ సబ్ స్టేషన్ జేపీఎన్ నగర్ కాలనీ, నాగార్జున ఎన్క్లేవ్ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు, మియాపూర్ ఫీడర్ మదీనగూడ సబ్ స్టేషన్ లేక్ వ్యూ ఎన్క్లేవ్, రాయ్ అపార్ట్మెంట్స్, సత్య కళ్యాణి అపార్ట్మెంట్, ఆర్ బి ఆర్ కాంప్లెక్స్, మియాపూర్ ఎక్స్ రోడ్స్, బాలాజీ నగర్, ఆర్ వి అవనీంద్ర అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో విద్యుత్ ను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఖాజాగూడ ఫీడర్ పరిధిలో
33/11కెవి ల్యాంకో సబ్ స్టేషన్ నిర్వహణ కారణంగా కాజగూడ, గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్, హెచ్. ఎం. డి. ఏ అండ్ హెచ్. జి. సి. ఎల్, ఎస్. ఎస్ ఇన్ఫ్రా, సాయి ఐశ్వర్య లేఅవుట్, సాయి వైభవ్ కాలనీ, ఓక్రిడ్జ్ స్కూల్, చిత్రపురి కాలనీ, ఎం. ఐ. జి, హెచ్. ఐ. జి, ఎల్. ఐ. జి, లాంకో టవర్స్, అంకురా హాస్పిటల్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ను నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
లింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లో
చెట్ల కొమ్మలను కత్తిరించడం మరియు ఫీడర్ నిర్వహణ పనుల కారణంగా 11కేవీ పరిధిలోని వెజ్ మార్కెట్, లింగంపల్లి మటన్ మార్కెట్, పోలీస్ క్వార్టర్స్, కానుకుంట, కూరగాయల మార్కెట్, ఎస్. ఎం. లేఅవుట్ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు,11కెవి చందానగర్ హుడా కాలనీ ఫీడర్ పరిధిలోని చందానగర్ హుడా కాలనీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.