పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
దశాబ్ది కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి తార్కానంగా తీర్చిదిద్దామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన అంతర్గత మురుగు నీటి కాలువలు, వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లను సోమవారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీ లతో పాటు నూతన గ్రామపంచాయతీలను సైతం అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్ళామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ శర వేగంగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి రామచందర్, ఎంపీటీసీ మమతా బిక్షపతి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.