geetham.jpg

పర్యావరణ పరిరక్షణకు విద్యాసంస్థలు నడుం బిగించాలి… – డాక్టర్ శివాజీరావు థార్మికోపన్యాసంలో పర్యావరణవేత్త ఎంసీ మెహతా పిలుపు

Telangana

పర్యావరణ పరిరక్షణకు విద్యాసంస్థలు నడుం బిగించాలి... – డాక్టర్ శివాజీరావు

పటాన్ చెరు:

నిరంతరాయంగా పెరుగుతున్న జనాభా , మారుతున్న జీవన విధానాలు పర్యావరణానికి మరింత చేటు చేస్తున్నాయని , పర్యావరణ పరిరక్షణకు ఉన్నత విద్యా సంస్థలు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణవేత్త , సుప్రీంకోర్టు న్యాయవాది ఎం.సీ.మెహతా పిలుపునిచ్చారు . గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ( జీఎస్ హెచ్ఎస్ ) , ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని పర్యావరణ శాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఆదివారం ఆన్ లైన్ లో నిర్వహించిన ‘ ప్రొఫెసర్ టి.శివాజీరావు థార్మికోపన్యాసం’లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు .

ఈ సందర్భంగా మాట్లాడుతూ… పర్యావరణం పరిరక్షణ ఆవశ్యకత , లేకపోతే తలత్తే పరిణామాలను విద్యార్థులు , సామాన్య ప్రజలకు వివరించి , దాని పరిరక్షణకు వారందరినీ సమాయత్తం చేయాలని సూచించారు . కరవు లేదా కాలుష్యంతో సతమతమవుతున్న ప్రాంతాలకు విద్యార్థులను పంపి , దాని నుంచి వారు స్వీయ అనుభవం పొందేలా చూడాలని ఆయన సలహా ఇచ్చారు . ప్రొఫెసర్ శివాజీరావుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ , కాలుష్యం వల్ల తాజ్ మహలకు జరుగుతున్న నష్టంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశామని , దానికి అవసరమైన నేపథ్య రూపకల్పనలో శివాజీ ఎంతో సహకరించినట్టు తెలిపారు .

అలాగే మధురై , పటాన్ చెరు పారిశ్రామికవాడల చుట్టుపక్కల ప్రజలపై కాలుష్య ప్రభావం వంటి పలు అంశాలపై వ్యాజ్యాలను దాఖలుచేసి , పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించామన్నారు . ప్రతి పౌరుడికీ మంచి గాలిని పీల్చే , మంచి నీటిని తాగే హక్కు జన్మతహః వస్తాయని , అవి ప్రకృతి ప్రసాదించిన వరాలని , కానీ ప్రస్తుతం వాటిని కొనాల్సిన దుస్థితి ఏర్పడడంపై ఆయన విచారం వెలిబుచ్చారు . ప్రతీ పౌరుడూ పుట్టుకతోనే పర్యావరణవేత్తని , కాలుష్యం వల్ల తలెత్తే పరిణామాలను గ్రహించకపోతే పర్యావరణాన్ని పరిరక్షించలేమని ఆయన చెప్పారు .

మేధావులకు విశ్రాంత జీవనం అనేది ఉండదని , వారంతా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించాలని మెహతా పిలుపునిచ్చారు . తొలుత , గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ , డాక్టర్ శివాజీరావు సేవలను స్మరించుకుంటూ , పర్యావరణ శాస్త్రాన్ని గీతమ్ లో ప్రవేశపెట్టడంలో ఆయన అందించిన ఇతోధిక సాయాన్ని గుర్తుచేసుకున్నారు . అభివృద్ధి పేరిట ప్రకృతి విరుద్ధంగా వ్యవహరిస్తున్నామని , అది శృతిమించితే ప్రకృతే దానిని సమతుల్యం చేస్తుందని ఆయన హెచ్చరించారు . గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మని మనకు నష్టం చేస్తుందని , మానవ మనుగడ కోసం ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు . జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీవీవీ నాగేంద్రరావు స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్ డాక్టర్ శివాజీ జీవితచరిత్రను క్లుప్తంగా వివరించారు . కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వి.సరిత వందన సమర్పణతో థార్మికోపన్యాసం ముగిసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *