పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
అంబేద్కర్ స్ఫూర్తితో దేశ ఐక్యతను చట్టాలని శ్రీ వరసిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నవీన్ చారి అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం సిటిజన్ కాలనీ సమీపంలో శ్రీ వరసిద్ధి వినాయక వెల్ఫేర్ అధ్యక్షుడు, అసోసియేషన్ సభ్యులతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా సభ్యులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా జాతీయ భావం పెంపొందించుకోవాలని, ప్రతీ ఒక్కరూ గణతంత్ర వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
