పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
అయోధ్య భవ్య రామ మందిరంలో శ్రీ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకొని పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ వరసిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు స్వామి వారి యొక్క ప్రసాదాలను అందించారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నవీన్ చారి మాట్లాడుతూ 500 సంవత్సరాల కళ నెరవేరిందని అయోధ్యలో భవ్య రామ మందిరంలో శ్రీ బాల రాముల విగ్రహ పణ ప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా చేయడం చాలా ఆనందంగా ఉంది అని భారతదేశము భిన్నత్వంలో ఏకత్వమని కులమత్ యాత్రలకు అతీతంగా ఈ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారని అన్నారు. ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో ఇంద్రేశం సిటిజన్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ శ్రీరాముని పూజా కార్యక్రమానికి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరము కలిసి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సాయంకాలము పెద్ద ఎత్తున స్వామి వారి శోభాయాత్ర నిర్వహించడం శోభాయాత్రలో చాలామంది యువకులు పాల్గొని తమ యొక్క భక్తిని చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, కోశాధికారి వేణుగోపాలు, ఉపాధ్యక్షులు భూపిన్ కుమార్, కార్యదర్శి సందీప్ కుమార్, నిర్వహణ కార్యదర్శి సునీల్ చారి, సలహాదారులు బద్రి, విశాల్, రాజు, మల్లేశం, సభ్యులు చండీశ్వర్, శ్రావణ్ చారి, నరేష్, సురేష్, ఆకాష్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.