పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
అయోధ్య భవ్య రామ మందిరంలో శ్రీ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం పరిష్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయం, మహదేవుడి ఆలయం, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, మిన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు శ్రీ హనుమాన్ దేవాలయం, వాణి నగర్ సీతారామచంద్ర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన వివిధ పూజా కార్యక్రమాలలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాహన ర్యాలీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కోట్ల మంది భారతీయుల వందల ఏళ్ల నాటి కల నేడు సాకారం కావడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.