గీతమ్ లో జాతీయ యువజన దినోత్సవం 

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ శుక్రవారం ‘జాతీయ యువజన దినోత్సవాన్ని’ జరుపుకున్నారు. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), విద్యార్థి విభాగం చరెవైతితో పాటు స్టూడెంట్ లెఫ్ట్ కలిసి దీనిని నిర్వహించారు. స్వామి నినేకానంద ఆలోచనలు, తత్వశాస్త్రంతో యువతను ప్రేరేపించడం, యువతకు మార్గనిర్దేశక శక్తిగా పనిచేయడం, దేశాభివృద్ధికి వారి ప్రయత్నాలను ప్రోత్సహించడం ఈ వేడుక లక్ష్యం. ఈ సందర్భంగా గీతం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద జాతీయ భావనను పునరావిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేసి, ఆ తరువాత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, గణిత విభాగాధిపతి ప్రొఫెసర్ మోతహర్ రెజా, ఎన్ఎస్ఎస్-ఎన్సీసీ సమన్వయకర్తలు డాక్టర్ పీనీ నాగేంద్రకుమార్, అజయలతో పాటు స్టూడెంట్ లెఫ్ట్ అధికారి జియో సిరిల్ పొడిపర, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతియేటా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత ప్రభుత్వం దీనిని 1984లో అధికారికంగా ప్రకటించి, ఆ మరుసటి ఏడాది నుంచి స్వామి వివేకానంద బోధనలు, తత్వశాస్త్రంతో యువతను ప్రేరేపించడానికి దేశవ్యాప్తంగా దీనిని జరుపుతున్నారు.

జాతి నిర్మాతలను రూపొందించడంపై కార్యశాల

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రేపటి జాతి నిర్మాతలను మలచడం: సివిల్ ఇంజనీరింగ్ కరికులమ్’పై శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలు, భవిష్యత్తు ధోరణులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడం, సివిల్ ఇంజనీరింగ్లో నెపుణ్యం – ఆధారిత విద్యను అందించడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి మార్గదర్శనంలో, ప్రఖ్యాత పరిశోధన- విద్యా సంస్థల నిపుణులు ఈ వర్కుషాప్ లో పాల్గొన్నారు. ఎన్ఐటీ సూరత్ కల్ కు చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కట్టా వెంకట రమణ, ఐఐటీ ధార్వాడ్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ విజిటింగ్ ప్రొఫెసర్ కేవీ జయకుమార్, ఎన్ఐటీ సూరత్ కల్ పూర్వ ఆచార్యుడు డాక్టర్ ఎ.యు.రవిశంకర్ తదితర నిపుణులు తమ విలువైన మార్గదర్శనాన్ని అందించారు.పరస్పర చర్చలు, ఆలోచనల మార్పిడికి, సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లలో వినూత్న విధానాల అన్వేషణకు వేదికగా ఈ కార్యశాల ఉపయోగపడింది. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే కాకుండా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేసే పాఠ్యాంశాలను రూపొందించడంలో నిపుణులంతా చురుకుగా పాల్గొన్నారు. అలాగే యూపీఎస్సీ, గేట్, ఐఈఎస్ వంటి జాతీయ పోటీ పరీక్షలను ఛేదించేలా విద్యార్థులను సన్నద్ధులను చేసేలా ఆయా పాఠ్యాంశాలను రూపొం దించాలని వారు సూచించారు.గీతం హెదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు ప్రాంగణాలకు చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు డాక్టర్ చేపూరి అఖిలేష్, డాక్టర్ డి.ముకుందరావు, డాక్టర్ శుభ అవినాష్లు ఈ కార్యశాలలో చురుకుగా పాల్గొని, ప్రతిపాదిత పాఠ్యాంశాలను మెరుగుపరచడానికి వారి అభిప్రాయాలు, సూచనలను అందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *